వారసత్వ అటవీ హక్కుల పత్రాల పంపిణీ

28-11-2026 | 05:01pm

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్

కామారెడ్డి, నవంబర్ 28 (విజయక్రాంతి): అటవీ హక్కుల గుర్తింపు చట్టం(Recognition of Forest Rights Act) కింద 11 మండలాలకు చెందిన 46 మంది గిరిజన లబ్ధిదారులకు(Tribal beneficiaries) శనివారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్(District Collector Ashish Sangwan) వారసత్వ హక్కుల(Inheritance rights) పట్టా పాస్ పుస్తకాల పంపిణీ(Distribution of Pattadar Passbooks) చేశారు. కామారెడ్డి జిల్లాలో(Kamareddy District) అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద అర్హులైన గిరిజన లబ్ధిదారులకు వారసత్వ హక్కుల బదిలీ పట్టా పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్  ఆశిష్ సంగ్వాన్  చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్,ఎన్ వై గిరి, ల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మైదాన ప్రాంతాల్లో అటవీ హక్కుల వారసత్వ బదిలీ పట్టా పాస్ పుస్తకాల పంపిణీ ప్రక్రియను కామారెడ్డి జిల్లాలో తొలిసారిగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని 11 మండలాలకు చెందిన మొత్తం 46 మంది అర్హులైన గిరిజన లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ స్వయంగా వారసత్వ హక్కుల పట్టా పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.అటవీ హక్కుల గుర్తింపు చట్టం ద్వారా గిరిజనులకు కల్పించబడిన హక్కులు వారి వారసులకు చట్టబద్ధంగా బదిలీ అయ్యేలా ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు, తద్వారా గిరిజన కుటుంబాలకు వారి హక్కులపై భరోసా కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి డి.సౌజన్య , కార్యాలయ సిబ్బంది ఆర్. దేవేందర్ , బి. శ్రీధర్ బాబు , వసతి గృహ సంక్షేమ అధికారి ఎస్. నవీన్ , ఎం.డి. ఇంతియాజ్, కె. మోహన్ , ఎం.డి. మునీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు