మెడికల్ కాలేజీ అభివృద్ధికి రూ.24.40 కోట్ల నిధులు మంజూరు

16-11-2026 | 03:15pm

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు 10 కోట్లు మంజూరు 

వైద్య విద్య, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ

కామారెడ్డి, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి మెడికల్ కళాశాల(Kamareddy Medical College) అభివృద్ధికి రూ.24.40 కోట్లు నిధులు మంజూరైనట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. సోమవారం మెడికల్ కళాశాలను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్య, విద్య, మౌలిక సదుపాయాల బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. త్వరలో కామారెడ్డిలో క్రిటికల్ కేర్ సెంటర్, మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కామారెడ్డిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణానికి 10 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు.

మెడికల్ కళాశాలలో చేపట్టనున్న అభివృద్ధి పనులు అదనపు మౌలిక సదుపాల కల్పనకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను షబ్బీర్ అలీ వివరించారు. మెడికల్ కళాశాల భవనాలు బాలుర బాలికల వసతి గృహాలు వంటశాల డైనింగ్ హాల్ ప్రిన్సిపల్ క్వార్టర్ తాగునీటి సరఫరా పారిశుధ్యం రహదారులు డ్రైనేజీ కాంపౌండ్ వాల్ తదితర మౌనిక సదుపాయాలు అభివృద్ధి ఈ నిధులను వినియోగించనున్నట్లు తెలిపారు. కామారెడ్డి మెడికల్ కళాశాల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

సామాన్య పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని లక్ష్యంతో ప్రభుత్వ ముందుకు సాగుతుందన్నారు. మెడికల్ కళాశాల కు మంజూరైన రూ. 24.40 కోట్లతో పలు కీలక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. నిధులను మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు కామారెడ్డి ప్రజల తరఫున మెడికల్ కళాశాల విద్యార్థులు అధ్యాపకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఇలియాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐ రేణి సందీప్ కుమార్, గూడెం శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, రామ్మోహన్, మాజీద్, భూపతి, అంజాద్, నీట్టు వెంకట్రావు, గంప ప్రసాద్ ,ఉరుగొండ ప్రవీణ్, సంతోష్ రావు, భరత్, సోఫియా, డేవిడ్, వడ్ల సురేష్, అనిరుద్, ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు