ప్రజావాణికి 3 దరఖాస్తులు
లక్షేట్టిపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేటలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి(Prajavani Program)లో మొత్తం మూడు దరఖాస్తులు వచ్చినట్లు ఏంపీడీఓ అనిల్ కుమార్ తెలిపారు. వీటిలో స్థానిక బీట్ బజార్ కు చెందిన పాలకుర్తి అశోక్ అనే వ్యక్తి తన దుకాణాన్ని ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా అన్యాయంగా మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఫిర్యాదు చేశారు.
మున్సిపల్ అధికారుల వలన తనకు సుమారు రూ. 7 లక్షల ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా మెప్మా ఆధ్వర్యంలో చెల్లించాల్సిన టైలరింగ్ బిల్స్ అందటం లేదని, తిలక్ నగర్ లో డ్రైనేజీ సమస్య ను పరిష్కారించాలని కోరుతూ ప్రజలు ఏంపీడీఓ ఫిర్యాదు చేశారు. కాగా, వచ్చినటువంటి దరఖాస్తులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా సంబంధిత శాఖలకు ఆదేశాలిచిన్నట్టు ఏంపీడీఓ అనిల్ కుమార్ వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.