సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్మన్‌గా సత్తు శ్రీనివాస్ రెడ్డి నియామకం

16-11-2026 | 03:08pm

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్న సత్తు శ్రీనివాస్ రెడ్డి

తంగళ్ళపల్లి, నవంబర్ 16 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ(AMC) చైర్మన్‌గా సత్తు శ్రీనివాస్ రెడ్డి(Sattu Srinivas Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్‌గా నియామకం అయిన అనంతరం ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్‌ను సత్తు శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఆశీస్సులు అందుకున్నారు. నూతన చైర్మన్‌కు ఆది శ్రీనివాస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి, మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలందించాలని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు