ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌ను తొలగించాలంటూ వైద్య విద్యార్థుల ఆందోళన
కలెక్టరేట్ ఎదుట తలకు పాలిథిన్ కవర్లు ధరించి నిరసన
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఇంచార్జ్ ప్రిన్సిపాల్‌ను తొలగించి, గతంలో విధులు నిర్వహించిన ప్రిన్సిపాల్‌నే తిరిగి కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వైద్య విద్యార్థులు రోడ్డెక్కారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు వినూత్న రీతిలో నిరసన(Medical Students Protest) చేపట్టారు. తలకు పాలిథిన్ కవర్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఇంచార్జ్ ప్రిన్సిపాల్ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేసిన విద్యార్థులు, గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్‌ను తిరిగి నియమించాలని డిమాండ్ చేశారు.
తమ సమస్యను అధికారులు పట్టించుకోవాలని, విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.ఈ సందర్భంగా విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తూ తమ ఆందోళనను కొనసాగించారు. తమ డిమాండ్ పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వైద్య విద్యార్థులు పెద్ద సంఖ్యలో నిరసనలో పాల్గొనడంతో కలెక్టరేట్ పరిసరాల్లో కొద్దిసేపు సందడి నెలకొంది.