పాలెంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక
లబ్ధిదారుల ఆనందం
వెంకటాపురం, నూగూరు, నవంబర్ 16, (విజయక్రాంతి): వెంకటాపురం మండల పరిధిలో పాలెం గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ వేడుక(Indiramma housewarming ceremony) సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్, సర్పంచ్ పుష్ప హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటి లబ్ధిదారులు వాసం సర్వేశ్, నాగమణి నూతన గృహంలో గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొల్లె మల్లికార్జున్, కొప్పుల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్‌తో పాటు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
లబ్ధిదారులు వాసం సర్వేశ్, నాగమణి మాట్లాడుతూ.. గత కొద్ది సంవత్సరాలుగా సొంత ఇల్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. తమ పరిస్థితిని గుర్తించి ఇందిరమ్మ ఇంటి మంజూరుకు సహకరించిన కాంగ్రెస్ పార్టీకి, మండల అధ్యక్షులు సయ్యద్ హుస్సేన్‌కు. ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ.. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చేరేలా నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.నూతన ఇంటిలోకి అడుగుపెట్టిన వాసం సర్వేశ్, నాగమణి కుటుంబానికి పలువురు నాయకులు, గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.