అద్వైత రథయాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఆలయం(Ayyappa Temple) వద్ద అద్వైత రథయాత్రను శనివారం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) ప్రారంభించారు. డిసెంబర్ 12వ తేదీ హైదరాబాద్ పటాన్చెరువు దగ్గర జిఎంఆర్ కన్వెన్షన్ గ్రౌండ్ లో నిర్వహించనున్న అయ్యప్ప స్వామి కోటి నామార్చన కార్యక్రమంలో భాగంగా శనివారం అద్వైత రథయాత్రను కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు ఈ కోటి నామార్చన లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ప్రపంచ రికార్డు సాధించబోయే కార్యక్రమం కామారెడ్డిలో ప్రారంభం కావడం ఎంతో గొప్ప విషయమని అన్నారు. కేరళ సహాయ అర్చకులు, కాలడి ఆది శంకర మఠ్ వ్యవస్థాపకుడు ఉన్నికృష్ణన్ నంబూద్రి మాట్లాడుతూ డిసెంబర్ 12వ తేదీ 18,000 మంది అయ్యప్ప స్వాములతో కోటి నామార్చన కార్యక్రమం నిర్వహించ బడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి రావాల్సిన వారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి ఈ కోటి నామార్చన లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దీనికోసం ఈ అద్వైత రథయాత్రాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ రథయాత్ర డిసెంబర్ 10వ తేదీ బిహెచ్ఈఎల్ అయ్యప్ప ఆలయం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు కన్నయ్య శాస్త్రి, ఆలయ అధ్యక్షుడు నస్కంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గోనే శ్రీనివాస్, కార్యనిర్వహణ అధ్యక్షుడు పట్నం రమేష్, అన్న ప్రసాద్ సేవాసమితి అధ్యక్షుడు రాజేందర్, నూకల ఉదయ్, పేపర్ శీను, మోటూరి శ్రీకాంత్, అయ్యప్ప స్వాములు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.