పండుగల సాయన్న విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు

21-11-2026 | 10:03pm

రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిట శ్రీహరి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.

కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్త పల్లి మండలం కల్వకోలు గ్రామంలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం(World Fishermen's Day) సందర్భంగా బస్టాండు ఆవరణంలో ఏర్పాటు చేసిన  పండుగ సాయన్న విగ్రహాన్ని(Pandugala Sayanna Statue) రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. మత్స్యశాఖ మంత్రి వాటిక శ్రీహరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కల్వకోల్  నిర్వహించిన బహిరంగ సభలో కొల్లాపూర్ రాజా గారు బండ్ల ముందు వేరువేరుగా నిర్వహించిన రెండు సభల్లో రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి వాకిట శ్రీహరి.జూపల్లి సభలోకి వచ్చే క్రమంలో మత్సకారులు ప్రజలు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

పోలీసులు బుజ్జగింపడంతో వారు మాట్లాడుతూ... పండుగ సాయన్న పేదల బతుకులు మార్చిందని చెరువులు గుంటలను, తోడించి చేపలు ఎలా వేయాలో నేర్పించిందని మత్స్యకారులకు తెలియజేశారు. గత ప్రభుత్వాలు పండుగ సాయన్న వర్ధంతి జయంతి వేడుకలకు అనుమతి ఇవ్వలేదు అని. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వాకిట శ్రీహరి పండుగల సాయన్న విగ్రహానికి జయంతి వర్ధంతికి అనుమతి ఇవ్వాలని  కోరగా ఆరు రోజుల్లోనే జీవో తీసుకువచ్చి ఇచ్చినా ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందని వారు తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పండుగల సాయన్న సినిమా ఎందుకు తీయలేదని ఆయన ఆరోపించారు. పండగల సాయన్న. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. చాకలి ఐలమ్మ. కొమరం భీం సినిమాలను తీయాలన్నారు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసం త్యాగం చేసిన ఘనత వీరికి దక్కిందన్నారు. అందుకే వారి సినిమాలు తీయాలని అన్నారు. ముదిరాజులు అంటే ఆలోచన పరంగా ఎదగాలని బాగా చదువుకొని ఒక స్థాయిలో ఉండాలన్నారు. బీసీ డి నుంచి ఏక్ మార్చి కొల్లాపూర్ లో 100 ఎకరాల చేపల ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అన్నారు. 

అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ. పండుగల సాయన్న విగ్రహం కేవలం ఒక ప్రతిమ మాత్రమే కాదని పేదల ఆత్మగౌరవానికి హక్కుల కోసం సాగిన పోరాటానికి ప్రతిమ అని మంత్రి జూపల్లి అన్నారు. మహాత్మా గాంధీ.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. జ్యోతిరావు పూలే. పండుగ సాయన్న .వంటి మానియుల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలోని పేదల అభ్యున్నతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ముదిరాజులతో పాటు మత్సకార మృతిపై ఆధారపడి జీవిస్తున్న వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. బీసీ వర్గీకరణ పై వస్తున్న అభ్యంతరాలను న్యాయబద్ధంగా పరిశీలించి విద్యా ఉద్యోగ రంగంలో అవకాశాలు మెరుగుపడేలా కృషి చేస్తామని మంత్రి తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న... మాట్లాడుతూ. జూపల్లి కృష్ణా రావు నాగు పాము లాంటోడని కప్పల్ని  మింగినట్టు మింగు తుంటాడని ఆయన ఆరోపించారు. కొల్లాపూర్ లో ముదిరాజ్ బిడ్డని ఎమ్మెల్యే చేస్తానని అందుకు కావాల్సింది.

సర్పంచులు  ఎంపిటిసిలు కాదు. చట్టసభల్లో అసెంబ్లీ నుంచి ఉన్నత స్థానంలో ఉండి. మన హక్కులు మనమే సాధించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. కొల్లాపూర్ నియోజకవర్గ బీజేపీ ఏల్లేని సుధాకర్ రావు. ముదిరాజు ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బోర్ర జ్ఞానేశ్వర్. బిత్తిరి సత్తి. రక్షణ సేన పార్టీ పగిడాల శ్రావణి. ముదిరాజు సంఘం నాయకులు మత్స్యశాఖ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు