అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ బస్సులు
కామారెడ్డి డిపో మేనేజర్ దినేష్ కుమార్
కామారెడ్డి,(విజయక్రాంతి): అయ్యప్ప భక్తులు(Ayyappa devotees) శబరిమలై వెళ్లెందుకు కామారెడ్డి నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు కామారెడ్డి ఆర్టీసీ డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు. అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములకు, శబరిమల వెళ్ళు భక్తులకు టీజీఎస్ఆర్టిసి కామారెడ్డి బస్సు డిపో(TGSRTC Kamareddy Bus Depot) నుండి ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సౌకర్యం కల్పించబడినట్లు తెలిపారు. అయ్యప్ప భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శబరిమల వెళ్ళుటకు గురుస్వామి బస్సు బుక్కు చేసుకున్నచో వారికి ప్రయాణం చార్జీలు మినహాయింపు ఉంటుందన్నారు. బస్సు సీటింగ్ కెపాసిటీ తో పాటుగా ఇద్దరు వంట మనుషులు ఇద్దరు మణికంఠ స్వామి లను అనుమతించడం జరుగుతుందన్నారు. శబరిమల వెళ్ళు బస్సులకు టోల్గేట్ రుసుము, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బార్డర్ టాక్స్లు భక్తులు చెల్లించవలసిన అవసరం లేదు అన్నారు. టీజీఎస్ఆర్టీసీ బస్సులకు కేరళ రాష్ట్రంలో బోర్డర్ టాక్స్ లు మినాయింపు ఉందన్నారు.
బస్సుల పార్కింగ్ చార్జీలు భక్తులు చెల్లించవలసి ఉంటుందన్నారు. శబరిమల వెళ్ళు ఆర్టీసీ బస్సులలో అనుభవిజ్ఞులైన, రూటు తెలిసినా మంచి నైపుణ్యం ఉన్న డ్రైవర్లను ప్రతి బస్సుకు ఇద్దరి చొప్పున పంపడం జరుగుతుందన్నారు. కార్తీక మాసం పురస్కరించుకొని భక్తుల కోసం ప్రముఖ పుణ్య శైవ క్షేత్రాలు శ్రీశైలం, కాణిపాకం, స్వర్ణ దేవాలయం, జోగులాంబ, కంచి, కామాక్షి, అరుణాచలం క్షేత్రాలను దర్శించుకొనుటకు కామారెడ్డి డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ దినేష్ కుమార్ తెలిపారు.