బాన్సువాడలో ఇందిరాగాంధీ విగ్రహ పునర్నిర్మాణ పనుల పరిశీలన

15-11-2026 | 01:09pm

బాన్సువాడ, నవంబర్ 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ (Indira Gandhi Statue) విగ్రహ పునర్నిర్మాణానికి చేపడుతున్న ఏర్పాట్లను ఆదివారం మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేపడుతున్న విగ్రహ పునర్నిర్మాణానికి (Reconstruction Works) సంబంధించి చేపట్టాల్సిన పనులు, ఏర్పాట్ల వివరాలను స్థానిక నాయకులు, మున్సిపల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా విగ్రహ ప్రాంగణ అభివృద్ధి (Statue Premises Development), పరిసరాల సుందరీకరణ, అవసరమైన ఏర్పాట్లపై ఆయన పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా ఎజాజ్, 3వ వార్డు కౌన్సిలర్ హకీమ్, నాయకులు నార్ల రవీందర్, రఫిక్, సయ్యద్ ఇలియాస్ అలీ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు