తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి
తిరుమలాయపాలెం, నవంబర్ 15 (విజయక్రాంతి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి పోరాడిన ఉద్యమకారులకు నేటికీ తగిన గుర్తింపు, న్యాయం దక్కకపోవడం బాధాకరమని ఖమ్మం జిల్లా టీ జేఏసీ చైర్మన్ మందడి ఇజ్రాయిల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారులకు పింఛన్లు, ఇంటి స్థలాలు కల్పించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా, కేకే కమిటీ నివేదిక సమర్పించినా అమలులో జాప్యం ఎందుకని ప్రశ్నించారు.
అర్హులైన ఉద్యమకారులను పారదర్శకంగా గుర్తించి, కమిటీ సిఫారసులను తక్షణమే అమలు చేయాలని కోరారు. వృద్ధాప్యంలోకి చేరుకుంటున్న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకనైనా నెరవేర్చి ఆర్థిక భరోసా కల్పించాలని మందడి ఇజ్రాయిల్ డిమాండ్ చేశారు.