ఎల్కాపళ్లిలో యువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ

15-11-2026 | 01:00pm

బెజ్జూర్, నవంబర్ 15 (విజయక్రాంతి): బెజ్జూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎల్కాపళ్లి గ్రామంలో యువకులకు బీఆర్ఎస్ (BRS Party) నాయకులు అమిరుద్దీన్ ఆధ్వర్యంలో వాలీబాల్ కిట్లు (Volleyball Kits) పంపిణీ చేశారు. గ్రామంలో క్రీడలను (Sports Activities) ప్రోత్సహించి యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. కిట్లు అందుకున్న యువకులు సంతోషం వ్యక్తం చేస్తూ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుమ్ముల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు అమిరుద్దీన్, జంగిటి మల్లేష్, దుర్గం తిరుపతి, ప్రవీణ్, రమేష్, గుర్లే మల్లేష్, గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు