ఇసుక ట్రాక్టర్ పట్టివేత

21-11-2026 | 09:53pm

 రాజాపూర్ నవంబర్ 21: మండల కేంద్రం సమీపంలోని దుందుంబి వాగులో(Dundumbi Stream) శనివారం రెవెన్యూ అధికారులు(Revenue officials) దాడులు నిర్వహించినట్లు తాసిల్దార్ రాధాకృష్ణ తెలిపారు. వాగులు ఇసుక అక్రమ రవాణాకు(Illegal sand transportation) పాల్పడుతున్న ఒక ట్రాక్టర్ ను పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. టాక్టర్ యజమానిపై కేసు నమోదు(Case registration) చేసినట్లు తెలిపారు. మండలంలో ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ప్రజలు రెవెన్యూ అధికారులకు కానీ పోలీసులు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు