తెలంగాణ యూనివర్సిటీలో నూతన బోరుబావి తవ్వకం
భిక్కనూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): భిక్కనూర్‌లోని తెలంగాణ యూనివర్సిటీ సౌత్ క్యాంపస్‌లో ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్ఆర్ ఫౌండేషన్(SR Foundation) వ్యవస్థాపకుడు తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి చొరవతో వేయించిన నూతన బోరుబావిలో పుష్కలంగా నీరు పడింది.
క్యాంపస్‌లో నీటి సమస్య పరిష్కారానికి ఆయన ముందుకు వచ్చి బోరుబావి ఏర్పాటు చేయించడం పట్ల విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బోరుబావి ద్వారా విద్యార్థుల అవసరాలతో పాటు క్యాంపస్‌లోని మొక్కలు, పచ్చదనానికి నీటి సౌకర్యం కలగనుంది. విద్యార్థుల సంక్షేమం కోసం సహకరించిన సుభాష్ రెడ్డికి, ఎస్ఆర్ ఫౌండేషన్ బృందానికి యూనివర్సిటీ వర్గాలు కృతజ్ఞతలు తెలిపాయి.