420 హామీలను వెంటనే అమలు చేయాలి
బూర్గంపాడు, (విజయక్రాంతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రకటించిన 420 హామీలను తక్షణమే అమలు చేయాలని సారపాక టౌన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొనకంచి శ్రీనివాస్(BRS Sarapaka Town President Konakanchi Srinivas) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు మంగళవారం సారపాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు.
రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసి, స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో తిరుపతి ఏసోబు, కొనకంచి బసంతిదేవి, దాసరి వెంకటరమణ, సోము లక్ష్మీచైతన్యరెడ్డి, బండారి లక్ష్మీనారాయణ, గుల్ మహమ్మద్, కరీ నాగేశ్వరరావు, బెజ్జంకి కనకాచారి, బానోతు శ్రీను, పంగి సురేష్, మూడ్ మణికంఠ, గుగులోత్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.