తేనెటీగల పెంపకంపై రైతులకు అవగాహన
కేవీకే ఆధ్వర్యంలో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందే మార్గాలపై సూచనలు
గరిడేపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): మండలంలోని కీతవారిగూడెం గ్రామంలో గడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) మార్గదర్శకత్వంలో ఏలూరులోని సీహెచ్ఎస్డీ మహిళా కళాశాల బీఎస్సీ అగ్రికల్చర్ చివరి సంవత్సరం విద్యార్థినులు రైతులకు అంటుకట్టడం, తేనెటీగల పెంపకంపై మంగళవారం రైతుల(farmers)కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అంటుకట్టడం ప్రాముఖ్యత, వివిధ రకాలు, నిర్వహించే పద్ధతులు, వాటి ప్రయోజనాలను వివరించారు. నాణ్యమైన మొక్కల అభివృద్ధి, అధిక దిగుబడులు, తక్కువ సమయంలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.
అలాగే తేనెటీగల పెంపకం ద్వారా తేనె, ఇతర ఉత్పత్తులతో అదనపు ఆదాయం పొందవచ్చని, పరాగసంపర్కం ద్వారా పంటల దిగుబడి, నాణ్యత పెరుగుతాయని వివరించారు. తక్కువ పెట్టుబడితో వ్యవసాయానికి అనుబంధంగా ఈ విధానాలను చేపట్టి రైతులు అదనపు లాభాలు పొందాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రైతులు గుండు సతీష్, రామలింగయ్య,నరేష్,పీరుసాహెబ్, వెంకటేష్,ముంత నాగయ్య, ఎల్లావుల రాములు, కట్రేవుల నర్సయ్య, వినయ్,బొల్లెపల్లి పాపయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థినులు ఎం. నవ్యశ్రీ, వై. మనీషా, పి. హేమలత, ఐ. సత్యజ్యోతి, వై. సౌమ్య, ఆర్. మోనిక కార్యక్రమాన్ని నిర్వహించారు.