చింతా బాబు మాదిగకు ఘన సన్మానం

17-11-2026 | 11:03pm

కోదాడ నవంబర్ 17 (విజయక్రాంతి): కోదాడ నయానగర్ బాప్టిస్ట్ చర్చి ఆవరణంలో క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత చింతా బాబు మాదిగ(Chinta Babu Madiga)కు మంగళవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చింతా బాబు మాదిగ అనేక యువజన కార్యక్రమాలను నిర్వహిస్తూ, యువతను సంఘటితం చేసి, వారిని బలోపేతం చేయడంలో విశేష కృషి చేశారని కొనియాడారు.

అదేవిధంగా ఎమ్మార్పీఎస్ నాయకత్వంలో రిజర్వేషన్ల సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప నాయకుడని ప్రశంసించారు.  ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ మైనార్టీ మాజీ కోఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి ఏసయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కంపాటి పుల్లయ్య, గుండెపంగు రమేష్, 34వ వార్డు కౌన్సిలర్ గంధం బాలేంద్ర పాండు, కుడుముల రాంబాబు, రాజేష్, సామ్యూల్ కిరణ్, కోర్ కమిటీ సభ్యులు జాన్, చల్మయ్య, గోపి, కంపాటి శివాజీ, తమలపాకుల సైదులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు