సంక్షేమ విద్యార్థుల.. సౌకర్యాల వ్యధ..!

17-11-2026 | 10:34pm

- మెనూ పాటించని సంక్షేమ అధికారి....!

- విద్యార్థుల వ్యధనను పట్టించుకునేది ఎవరు....?

- పట్టపగలే బియ్యం అక్రమ రవాణా...!

- ఈ వార్డెన్ వద్దు బాబాయ్ అంటున్న విద్యార్థులు

మణుగూరు, నవంబర్ 17 (విజయక్రాంతి): ప్రభుత్వం ఎన్నో లక్షల రూపాయలు పెట్టి విద్యార్థులను చదివించాలని లక్ష్యంతో వసతి గృహాలు ఏర్పాటు చేసింది. విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పిస్తుంటే, సంక్షేమ అధికారులు మాత్రం పిల్లలకు మెనూ ప్రకారం పెట్టకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

మణుగూరు(Manuguru) మండలంలోని అశోక్ నగర్ లోని బాలురు సంక్షేమ వసతి గృహంలో సంక్షేమ అధికారి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ విద్యార్థులకు మెనూ ప్రకారం పెట్టకుండా, అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి కూత దూరంలో సంక్షేమ వసతి గృహం ఉన్న, కనీసం జాగ్రత్తలు పాటించకుండా ఆజాగ్రత్తగా ఉంటూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మెనూ ప్రకారం పెట్టడం లేదని, కాస్మోటిక్  చార్జెస్ ఇవ్వడం లేదని, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంగళవారం ఆ వసతి గృహానికి చెందిన, సంక్షేమ అధికారి పట్టపగలే వసతి గృహం నుండి బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుంటే పలువురు అడ్డుకోవడంతో వెంటనే ఆ బియ్యాన్ని హాస్టల్ కు తరలించాడు. 25 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన సంక్షేమ అధికారి నిరంతరం నిషాలో ఉంటున్నట్లు, విద్యార్థులు సైతం తెలిపారు. కనీసం మా గురించి ఆలోచించడం మరిచాడని, దుప్పట్లు, కుర్చీలు ఇవ్వకుండా ఇంటికి తరలించారని విశ్వసనీయ సమాచారం. విద్యార్థులను పట్టించుకోకుండా ఆ సంక్షేమ అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈ సంక్షేమ అధికారి మాకొద్దు బాబోయ్ అంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు రోజుల క్రితమే జిల్లా సంక్షేమ శాఖ అధికారి తనిఖీ నిర్వహించినప్పటికీ ఆ సంక్షేమ అధికారి తీరు మారలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఆ సంక్షేమ అధికారి పై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు