రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ నాయకుడు

11-11-2026 | 07:53pm

ఇంటికి వెళ్లి పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

మానకొండూరు, నవంబర్ 11 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన కరీంనగర్ జిల్లా గంగిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అంబటి తిరుపతి రాజును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar) బుధవారం పరామర్శించారు.

గంగిపల్లి నుంచి కరీంనగర్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మానకొండూర్ చెరువు కట్ట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో తిరుపతి రాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ బుధవారం ఉదయం ఆయనకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కరీంనగర్‌లో తన అధికారిక కార్యక్రమాలు పూర్తయిన వెంటనే బండి సంజయ్ నేరుగా తిరుపతి రాజు ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఏమాత్రం అధైర్యపడవద్దని, పూర్తి అండగా ఉంటామని భరోసా ఇస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కష్టసమయంలో తనకు ఫోన్ చేసి ధైర్యం చెప్పడమే కాకుండా, స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు తిరుపతి రాజు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాజును పరామర్శించిన వారిలో

కరీంనగర్ కార్పొరేటర్ పార్లమెంట్ కన్వీనర్ బోయినపెల్లి ప్రవీణ్ రావు జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి, రంగు భాస్కరా చారి, గంగిపల్లి గ్రామ సర్పంచ్ వాల ప్రదీప్ రావు, మాజీ ఎంపీటీసీ నాగయ్య, దూలం కిరణ్, చిట్యాల లక్ష్మయ్య, రావుల శ్రీనివాస్, రంగు శ్రీనివాస్, తిక్క దేవేందర్, రావుల వెంకటరాజం, ముల్కల శ్రీనివాస్, పిట్టల ఆంజనేయులు, ఎనగందుల సంపత్, కాట సంపత్, కాట శంకర్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు