ప్రమాద నివారణ.. ప్రథమ చికిత్సే ప్రాణరక్షణ!
- ట్రామా సమయంలో అన్ని విభాగాలున్న ఆసుపత్రే కీలకం
- వరల్డ్ ట్రామా డే సందర్భంగా మెడికవర్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
కరీంనగర్, అక్టోబర్ 17(విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాలు, ఇతర ఆకస్మిక ఘటనల్లో గాయపడిన వారిని సకాలంలో సీటీ, ఎమ్మా రై, అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి సౌకర్యాలు... అన్ని విభాగాల వైద్యులు అందుబాటులో ఉన్న ఆసుపత్రికి వెళ్తే గొల్డెన్ అవర్లోనే చికిత్స అందించి ప్రాణాలను కాపాడవచ్చని కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి(Medicover Hospital ) వైద్యులు పేర్కొ న్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఇబ్బంది పడడం మానేసి.. ప్రమాదం జరగకుండా నివారణ చర్యలు తీసుకోవడమే మేలని సూచించారు.
వరల్డ్ ట్రామా డే సందర్భంగా శనివారం మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తూ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైద్యులు మాట్లాడు తూ.. ప్రమాదాలు, ఆకస్మిక ఘటనల కారణంగా శరీరానికి కలిగే తీవ్రమైన గాయాల ను ట్రామాగా పరిగణిస్తారని తెలిపారు.తల, మెదడు, వెన్నెముక, ఛాతీ, పొత్తికడుపు, ఎ ముకలకు గాయాలైనప్పుడు బాధితుడి పరిస్థితి వేగంగా విషమించే ప్రమాదం ఉంటుం దన్నారు.
అంతర్గత రక్తస్రావం లేదా అవయవాలకు నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. ఆలస్యం చేయకుండా వైద్య సహాయం పొందడం ఎంతో ముఖ్యమని తెలిపారు. ప్రమాదం జరిగిన తర్వాత బాధితుడిని సురక్షితంగా ఆసుపత్రి లో చేర్చి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. మెడికవర్‌లో అన్ని సూపర్ స్పెషాలి టీలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం లో ఎమర్జెన్సీ మెడిసిన్ వైద్యుడు డాక్టర్ సత్యనారాయణ, న్యూరోసర్జన్ డాక్టర్ రాజీవ్‌రెడ్డి, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ రవికుమార్, సర్జికల్ గ్యాస్ట్రో వైద్యుడు డాక్టర్ దిలీప్‌రెడ్డి, ఆర్థో పెడిక్ సర్జన్ డాక్టర్ వేణుగోపాల్, క్రిటికల్‌కేర్ వైద్యుడు డాక్టర్ ఉపేందర్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, దాసరి చంద్రశేఖర్, ఈశ్వర్, సాయిచరణ్ పాల్గొన్నారు.