రెండు ఎమ్మెల్సీలనూ గెలవాలి
- పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్రావు
హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమా యత్తం కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(BJP State President Ram Chander Rao) పిలుపునిచ్చారు. గతంలో హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని దివంగత నేత వీ రామారావు పలుమార్లు గెలుచుకున్నారని, ఇతర స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.
అభ్యర్థులు ఎవరనే దానితో సంబంధం లేకుండా, పార్టీ గెలుపే ధ్యేయంగా సమష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాం చందర్రావు అధ్యక్షతన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు (ఎన్రోల్మెంట్) పై సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సమావేశంలో శాసనమండలి సభ్యులు ఏవీఎన్రెడ్డి, మల్క కొముర య్యతో పాటు రెండు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, ఇన్ ఛార్జిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాంచందర్రావు మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీజేపీ ఆ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలి పారు. ఓటర్ల నమో దు ప్రక్రియపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక దృష్టి సారించాలని నేతలకు సూచించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడితో పాటు వారి కుటుంబ స భ్యులు, బంధుమిత్రులకు ఓటరు నమోదుపై విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు.
విద్యావంతులను ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు, పోలింగ్ రోజున వారు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు చొరవ చూపాలని కోరారు. సమాజంలో బీజేపీ పట్ల విద్యావంతులు, గ్రాడ్యుయేట్లలో బలమైన సానుకూలత ఉందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో దేశ ప్రతిష్టను దిగజార్చేలా సాగుతున్న ‘ఓట్ చోరీ’ ప్రచారం వెనుక విదేశీ శక్తుల ప్రమే యం దాగి ఉందని ఆయన హెచ్చరించారు. ఎమ్మెల్సీ ఎన్నికలను పార్టీ నేతలు, కార్యకర్తలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని కోరారు.