అప్పుడు అభయహస్తం ఇప్పుడు శూన్య హస్తం

17-11-2026 | 08:01pm

చుక్క శ్రీనివాస్ బిఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇంచార్జ్ 

ముకరంపుర, నవంబర్ 17(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల(Congress party elections0 సమయంలో అభయహస్తం పేరుతో ప్రజలకు ఆశలు నింపి నేటికీ మూడు సంవత్సరాలు గడిచిందని చుక్క శ్రీనివాస్ అన్నారు. శాతవాహన యూనివర్సిటీ ముందు అభయహస్తం ప్రతులను చెత్తబుట్టలో వేసి నిరసన తెలిపిన అనంతరం శాతవాహన యూనివర్సిటీ(Satavahana University) బీఆర్ఎస్వీ ఇంచార్జ్ చుక్క శ్రీనివాస్ మాట్లాడుతూ  ప్రజలకు కావాల్సింది మాటలు కాదని ఇచ్చిన హామీలు నెరవేర్చడం అన్నారు.

మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌ తో పోల్చిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కేవలం ఓట్లు సంపాదించడానికి మాత్రమే కాకుండా, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు జవాబుదారీగా ఉండాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ  బిఆర్ఎస్వి అధ్యక్షుడు కుక్కమల్ల నరేష్,  రమేష్ , నరసయ్య వెంకటేష్ , తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు