హామీల అమలు కోసం పోరాటం

17-11-2026 | 07:54pm

బిఆర్ఎస్ జిల్లా సమన్వయకర్త 

నిర్మల్ నవంబర్ 17 ( విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేసి కరువు మండలాలు ప్రకటించిన రైతులను ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని భారత రాష్ట్ర సమితి సమన్వయకర్త రామ్ కిషన్ రెడ్డి(BRS coordinator Ram Kishan Reddy) ఆరోపించారు. నిర్మల్ జిల్లాలో ప్రభుత్వం తొమ్మిది మండలాలను కరువుగా ప్రకటించి చేతులు దులుపుకుందని అన్నారు.

జిల్లా మొత్తాన్ని కరువు ఆ ప్రకటించి కరువు రైతులకు ప్రభుత్వం పరిహారం ఇప్పించాలని రైతుబంధు వెంటనే జమ చేయాలన్నారు. ఎన్నికల్లో రైతులకు మహిళలకు యువతకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చేయూత పింఛన్లను ప్రతి ఒక్కరికి అందించాలన్నారు. ప్రభుత్వ హామీల అమలుకై టీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో కలిసి పోరాటం చేస్తుందన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కృష్ణారెడ్డి అయ్యన్న గారి రాజేందర్ నజీర్ ఖాన్ మహేష్ రెడ్డి, అయ్యో రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు