ఐసా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలి

17-11-2026 | 07:52pm

భూపాలపల్లి, నవంబర్ 17 (విజయక్రాంతి): ఈ నెల 23న హనుమకొండలో నిర్వహించనున్న ఐసా రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రముఖ న్యాయవాది అబ్దుల్ కలాం(Advocate Abdul Kalam), ఐసా జిల్లా అధ్యక్షురాలు బుర్ర స్వాతి, కార్యదర్శి బందు సుజాత పిలుపునిచ్చారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా ఉపాధ్యక్షురాలు కిరణ్మయి అధ్యక్షతన మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. విద్యార్థులు రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఐసాలో భాగస్వాములు కావాలని వారు కోరారు. కార్యక్రమంలో స్ఫూర్తి, శ్రీవల్లి, నవ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు