అథ్లెటిక్ నూరేన్కు కేంద్ర మంత్రి బండి సంజయ్ సన్మానం
ముకరంపుర, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో ఇటీవల రజత పతకం సాధించిన కరీంనగర్ పట్టణం సవరణ్ స్ట్రీట్కు చెందిన నూరేన్ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay Kumar) అభినందించి, సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జాతీయ స్థాయి పోటీలలోనూ సత్తా చాటి పతకాలు సాధించాలని, తద్వారా కరీంనగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని నూరేన్కు సూచించారు.
భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అనంతరం నూరేన్ మాట్లాడుతూ.. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలలో 11 స్వర్ణ, 14 రజత పతకాలు సాధించినట్లు తెలిపారు. వచ్చే నెలలో మహారాష్ట్రలో జరగనున్న జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొనబోతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు సమీపర్వేజ్, మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.