బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన వారికి స్వచ్ఛభారత్ పనిష్మెంట్

17-11-2026 | 07:56pm

కోర్టు ఆదేశాలతో పారిశుధ్య పనులు

మేడిపల్లి, నవంబర్ 17(విజయక్రాంతి): బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ పట్టుబడిన నలుగురికి న్యాయస్థానం స్వచ్ఛభారత్ పనిష్మెంట్ (Swachh Bharat Punishment) విధించింది. ఈ సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 16న బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న మల్లాపూర్ కు చెందిన కోడూరి లిఖిల్(24), మౌలాలికి చెందిన గడపల్లి శ్రీనివాస్(23), పిర్జాదిగూడకు చెందిన యెడ్ల అన్వేష్ (24), బి. రోహిత్(24) పై పోలీసులు కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులను విచారించిన గౌరవ న్యాయమూర్తి వారికి  స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగడమే కాకుండా శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని మేడిపల్లి సిఐ డి.జలంధర్ రెడ్డి హెచ్చరించారు.

మరిన్ని వార్తలు