క్రికెట్ టోర్నమెంట్ కరపత్రం ఆవిష్కరణ

07-10-2026 | 06:12pm

ముకరంపుర, అక్టోబరు 7 (విజయక్రాంతి): రేకుర్తి  ఎస్ వి జె సి కాలేజీ గ్రౌండ్ లో ఈనెల 11న నిర్వహించనున్న సుధగోని నర్సయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్(Cricket Tournament) కరపత్రాన్ని 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని మాధవి కృష్ణ గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎంట్రీ ఫీజు 1500 ఉంటుందని, విజేత జట్టుకు 20,000, రన్నర్ జట్టుకు 10,000 నగదు బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొని టోర్నమెంట్ను విజయవంతం చేయాలని, క్రీడాభిమానులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సయ్యద్ మజీద్, అజయ్, మునీర్ ఖాన్, మెహెరాజ్, ఖలీద్,  జకీర్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు