అర్హులైన లబ్ధిదారులకు చేయూత ఆర్థిక సహాయం మంజూరు పత్రాల పంపిణీ
మున్సిపాలిటీలోని 19, 20, 23వ వార్డుల్లో పంపిణీ
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత
సత్తుపల్లి,విజయక్రాంతి): సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 19, 20, 23వ వార్డుల్లో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు అర్హులైన లబ్ధిదారులకు చేయూత ఆర్థిక సహాయం(Cheyutha financial aid) మంజూరు పత్రాలను మున్సిపల్ చైర్పర్సన్ రిహన కమల్ పాషా(Municipal Chairperson Rehana Kamal Pasha) అందజేశారు. ప్రజా సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యతగా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
ఆర్థికంగా అండగా నిలుస్తూ, ప్రజల కష్టాల్లో భాగస్వాములవుతూ వారి జీవితాల్లో భరోసా నింపడమే చేయూత పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు అపర్ణ నాగభూషణం, విజయకుమారి వెంకట్ నారాయణరెడ్డి, 19వ వార్డుb అధ్యక్షుడు యాకూబ్, 22వ వార్డు అధ్యక్షుడు యూనిస్, కాంగ్రెస్ నాయకులు ఎం.డి. కమల్ పాషా, రాయల కోటేశ్వరరావు, గజ్జల శీను, 23వ వార్డు అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.