చిన్ననాటి మిత్రుల ఆపన్నహస్తం..
మల్లేష్ యాదవ్ కుటుంబానికి ఆర్థిక సాయం
ఆలేరు, అక్టోబర్ 7 (విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమ నాయకుడు(Leader of the Telangana movement), మాజీ సర్పంచ్ కీర్తిశేషులు చిరబోయిన మల్లేష్ యాదవ్ కుటుంబానికి ఆయన చిన్ననాటి మిత్రులు ఆర్థిక సాయం అందించారు. ముందుగా మల్లేష్ యాదవ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాయితీ జగదీశ్వర్ రెడ్డి, వగ్గు మురళీకృష్ణ మాట్లాడుతూ.. 1981–82 బ్యాచ్‌కు చెందిన తామంతా చిన్ననాటి నుంచి కలిసి చదువుకున్నామని, మల్లేష్ యాదవ్ పేద ప్రజల కోసం సర్పంచ్‌గా ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. ఆయన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని పేర్కొన్నారు.
మల్లేష్ యాదవ్ కుటుంబానికి తమకు తోచినంత ఆర్థిక సహాయం అందించామని, భవిష్యత్తులోనూ కుటుంబానికి ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వగ్గు మురళీకృష్ణ, కాయితీ జగదీశ్వర్ రెడ్డి, పగుడాల రాజేశ్వరరావు, కల్లూరి ప్రభాకర్ రెడ్డి, ఆకుల వెంకటేశ్వరరావు, రమాదేవి, అన్నపూర్ణ, ఉషారాణి, కేతోజ్ నరేందర్ చారి, ఆకుల చంద్రశేఖర్, వగ్గు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.