ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన

26-11-2026 | 11:14am

సత్తుపల్లి, నవంబర్ 26 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా (Indiramma Family Life Insurance) పథకంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాన్ని గురువారం సత్తుపల్లి పట్టణంలోని 21వ వార్డులో నిర్వహించారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 21వ వార్డు కౌన్సిలర్ మందపాటి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం (Welfare Scheme) ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రూపొందించిన సంక్షేమ కార్యక్రమమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకంపై అవగాహన పెంచుకొని ప్రభుత్వ ప్రయోజనాలను (Government Benefits) పొందాలని కోరారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్‌పర్సన్ ఎం.డి. రిహానా కమల్ భాష, మున్సిపల్ కమిషనర్ నరసింహారావు హాజరయ్యారు. కాంగ్రెస్ నాయకులు తన్నీరు జమలయ్య, గాది చెన్నారావు, వార్డు ఆఫీసర్ బెజవాడ రాంబాబుతో పాటు అధికారులు, నాయకులు, 21వ వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరాలనే లక్ష్యంతో ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, ప్రతి కుటుంబ సంక్షేమానికి తోడ్పడటమే లక్ష్యంగా కార్యక్రమం నిర్వహించారు.

మరిన్ని వార్తలు