అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు

26-11-2026 | 11:04am

సిద్దిపేట రూరల్, నవంబర్ 26 (విజయక్రాంతి): పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ (Dr. B.R. Ambedkar) విగ్రహానికి గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం అంబేద్కర్ ఆశయాలను (Ideals) స్మరించుకుంటూ రాజ్యాంగ విలువలు (Constitutional Values), సమానత్వం, సామాజిక న్యాయం (Social Justice), సోదరభావాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ అందె మాధవి, సిద్దిపేట జిల్లా తెలంగాణ మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుడు కోదాది శ్రీనివాస్, కోదాది బాబు, వార్డు సభ్యుడు నరేష్, ముదిరాజ్ సంఘం నాయకులు శ్రీనివాస్, శ్రీశైలం ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకుడు కోదాది రమేష్, గ్రామ పెద్దలు రొడ్డ విద్యాసాగర్, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు