మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు స్థలం

18-11-2026 | 01:07pm

మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించిన ఎమ్మెల్యే మట్టా రాగమయి

శాలివాహన కుమ్మరి సంఘం విజ్ఞప్తికి సానుకూల స్పందన

కమ్యూనిటీ హాల్ స్థలంపై కూడా హామీ

సత్తుపల్లి,(విజయక్రాంతి): శాలివాహన కుమ్మరి సంఘం(Shalivahana Kummari Sangham) ముద్దుబిడ్డగా పేరొందిన, రామాయణాన్ని రచించిన తొలి మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహం(Mollamamba Statue) ఏర్పాటుకు స్థలం కేటాయించాలని, అదేవిధంగా శాలివాహన కుమ్మరుల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరుతూ సత్తుపల్లి మండల, పట్టణ శాలివాహన కుమ్మరి సంఘం కమిటీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. మున్సిపల్ కార్యాలయం సమీపంలో భగత్ సింగ్ విగ్రహం పక్కన ఉన్న స్థలంలో మొల్లమాంబ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని హామీ ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించి స్థలం కేటాయించే అంశాన్ని పరిశీలించి, తప్పకుండా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.

వెంటనే స్పందించి మొల్లమాంబ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌కు శాలివాహన కుమ్మరి సంఘం సత్తుపల్లి మండల, పట్టణ కమిటీలతో పాటు మండల, పట్టణ శాలివాహన కుమ్మరుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శాలివాహన కుమ్మరి సంఘం జిల్లా నాయకులు దండు ఆదినారాయణ, మొల్లమాంబ విగ్రహ నిర్మాణ కమిటీ కన్వీనర్ సాయిరాం, మెడికల్ ఏజెన్సీ అధినేత దండు రామారావు, మండల కన్వీనర్ గుడిమెట్ల రామారావు, సత్తుపల్లి పట్టణ శాలివాహన కుమ్మరి సంఘం నాయకులు రాము, మల్లికంటి రాము, ఏదులపరుపు వెంకటేశ్వరరావు, టిప్‌టాప్ టైలర్, రామానగరం గ్రామ కమిటీ నాయకులు దండు జగన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు