వికసిత్ భారత్ సంకల్ప సేవా జ్యోతి యాత్ర
- 2047లో వికసిత్ భారత్ లక్ష్యమే ఈ సంకల్ప సభ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- ముఖ్యఅతిథిగా విచ్చేసిన బిజెపి మాజీ ఎమ్మెల్యే ఎస్ సైదిరెడ్డి.
కొత్తగూడెంటౌన్,/లక్ష్మీదేవిపల్లి (విజయక్రాంతి): వికసిద్భారత్ సంకల్ప సేవ జ్యోతి యాత్ర(Viksit Bharat Sankalp Sabha - Seva Jyoti Yatra) కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి(BJP District President Byreddy Prabhakar Reddy) ఆధ్వర్యంలో వికసిత్ భారత్ సంకల్ప సభ-సేవా జ్యోతి యాత్రను బుధవారం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎమ్మెల్యే ఎస్. సైదిరెడ్డి, జిల్లా సంస్థ గత ఇంచార్జ్ డాక్టర్ విజయ చంద్రారెడ్డి పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా జీవితంలో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా ఈ దేశానికి సేవలందించడం 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ లో వికసిత్ భారత్ సంకల్ప సభలో జాతీయ బిజెపి అధ్యక్షులు నితిన్ నబిన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని జిల్లా వ్యాప్తంగా వచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులు, పట్టణంలో ప్రముఖులు, వివిధ కళాశాలల విద్యార్థిని, విద్యార్థులు ఆలకించారు.
ఈ ప్రసంగంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా ప్రతి పౌరుడు సంకల్ప దీక్షను తీసుకోవాలన్నారు. మా ప్రభుత్వ విధానం కుల, మత, రాజకీయాలు చేయడం కాదని దేశంలోని ప్రతి పౌరుడికి ఈ దేశ ఫలాలు అందాలన్నదే తమ ప్రభుత్వ విధానం అన్నారు. అదేవిధంగా 2047 వికసిత్ భారత్ వి విల్ డూ ఇట్, మేకిన్ ఇండియా వి విల్ డూ ఇట్. ఆత్మ నిర్భర్భారత్ వి విల్ డూ ఇట్. ఒలంపిక్ డ్రీమ్ వి విల్ డూ ఇట్. అంటూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు. అనంతరం కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి సేవా జ్యోతి యాత్రను జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో లక్ష్మీదేవిపల్లి వరకు కొనసాగించారు. ఈ యాత్రలో బిజెపి ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షులు జీవీకే మనోహర్ , కె.వి రంగా కిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోడియం బాలరాజు, ఇతర రాష్ట్ర జిల్లా నాయకులు కార్యకర్తలు, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.