ఏఈని అడ్డుకున్న ఇస్సన్నపల్లి రైతులు
07-10-2026 | 08:43pm
భిక్కనూర్, అక్టోబర్ 7 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం ఇస్సన్నపల్లి గ్రామ రైతులు(Issannapalli farmers) విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో ఏఈని అడ్డుకుని కొద్దిసేపు నిరసన తెలిపారు. సరిపడా విద్యుత్(Electricity) అందక పొలాలు నీరు లేక ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఏఈ రైతులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారులకు తెలియజేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. అనంతరం రైతులు ఏ ఈ కి వినతిపత్రం అందజేశారు.