పాడి రైతుల పొదుపు, కమిషన్‌ డబ్బుల లెక్కలు చెప్పాలి

07-10-2026 | 09:01pm

పాత అధ్యక్షుడిపై పోలీసులకు ఫిర్యాదు

కోనరావుపేట అక్టోబర్ 7 (విజయక్రాంతి): మర్తన్నపేట పాల ఉత్పత్తి కేంద్రా(Milk production center)నికి చెందిన 170 మంది పాడి రైతుల పొదుపు, కమిషన్‌ డబ్బులకు సంబంధించిన రూ.11,19,227ల లెక్కలు వెల్లడించడం లేదని ఆరోపిస్తూ రైతులు కోనరావుపేట పోలీసులను ఆశ్రయించారు.

పాల ఉత్పత్తి కేంద్రం పాత అధ్యక్షుడు సూర్యంపై రైతులు ఫిర్యాదు చేశారు. పాల ఉత్పత్తి కేంద్రానికి సంబంధించిన నిధుల లెక్కలు పూర్తిగా చూపించి, నూతన అధ్యక్షుడికి బాధ్యతలు అప్పగించాలని పలుమార్లు కోరినా స్పందించడం లేదని రైతులు ఆరోపించారు. రైతులకు సంబంధించిన డబ్బుల విషయంలో పారదర్శకత పాటించాలని, లెక్కలు వెంటనే వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ మేరకు కోనరావుపేట ఎస్సై రామ్మోహన్‌కు పాడి రైతులు ఫిర్యాదు చేసి, సమస్యపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు