రోడ్డు విస్తరణ పనులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం

07-10-2026 | 08:46pm

జవహర్‌నగర్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): హెచ్‌ఆర్‌డీసీఎల్‌ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లను నూతనంగా ఏర్పాటు చేసిన ఎం+9 టవర్లు, 11 మీటర్ల విద్యుత్ స్తంభాలకు మార్చే పనులు చేపట్టనున్నందున గురువారం (అక్టోబర్ 8) జవహర్‌నగర్‌ బాలాజీనగర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ సరఫరా(Power Supply)కు అంతరాయం ఏర్పడనుంది.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయిబాబా, శివాజీనగర్, ఆనంద్‌నగర్, మహాకాళీనగర్ ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లక్ష్మీ నరసింహ, సంతోష్‌నగర్ ఫీడర్ల పరిధిలో సరఫరా ఉండదు.బాలాజీనగర్, శాంతినగర్, శివాజీనగర్, ఆనంద్‌నగర్, సంతోష్‌నగర్, చెన్నాపూర్, సాయిబాబా కమాన్ రోడ్డు, వేంకటేశ్వర కాలనీ, శ్రీరామ్‌నగర్, బ్రిందావన్ కాలనీ, సిటిజన్ కాలనీ తదితర ప్రాంతాలపై ప్రభావం ఉండనుంది.

మరిన్ని వార్తలు