కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్
సత్తుపల్లి,(విజయక్రాంతి): సత్తుపల్లి పట్టణంలోని వేంసూరు రోడ్డులో ఉన్న దోబీ ఘాట్ వద్ద చివరి దశ నిర్మాణ పనులు కొనసాగుతున్న కమ్యూనిటీ హాల్‌ను సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత వర్గాలకు సూచించారు. కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు, ముఖ్యంగా రజక సంఘం సభ్యులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ మహమ్మద్ రెహనా కమల్ పాషా, సత్తుపల్లి ఏఎంసీ చైర్మన్ చల్లగుళ్ల నరసింహారావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు నారాయణవరపు శ్రీనివాస్, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సత్తుపల్లి పట్టణ రజక సంఘం అధ్యక్షులు విరివాడ నాగభూషణం, వార్డు కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.