పటాన్‌చెరు వేదికగా అద్వైత సంగమం

20-11-2026 | 01:11am

డిసెంబర్ 12న 40 వేల మంది అయ్యప్ప స్వాములతో మహా మంత్ర కోటి నామార్చన

పటాన్‌చెరు: మినీ ఇండియాగా పేరొందిన పటాన్‌చెరు మరో చారిత్రాత్మక ఆధ్యాత్మిక వేడుకకు వేదిక కానుంది. డిసెంబర్ 12న జీఎంఆర్ ఫంక్షన్ హాల్ గ్రౌండ్స్‌లో కలడి శ్రీ ఆది శంకర మఠం ఆధ్వర్యంలో అద్వైత సంగమం మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 25 వేల నుంచి 40 వేల మంది అయ్యప్ప స్వాములతో కోటి 8 లక్షల మహా మంత్ర జపం, వేలాది మంది మహిళలతో కోటి కుంకుమార్చన నిర్వహించనున్నారు.

శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి మహాస్వామి దివ్య సాన్నిధ్యంలో జరిగే ఈ వేడుకకు పందళం రాజవంశీయులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు హాజరుకానున్నారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు సైతం పాల్గొననున్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలడి శ్రీ ఆది శంకర మఠం ఫౌండర్ ట్రస్టీ ఉన్నికృష్ణన్, ఎమ్మెల్యే వెల్లడించారు. కార్యక్రమంలో పాల్గొనాలనుకునే భక్తులు ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, నమోదు చేసుకున్న వారికే ప్రవేశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు