సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం
సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సిద్దిపేటకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం నగరంలో పాదయాత్ర నిర్వహించిన సీఎం.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తన పర్యటనలో భాగంగా సీఎం కాసేపట్లో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Family Life Insurance Scheme) ప్రారంభించనున్నారు.
దీనికి సంబంధించిన దరఖాస్తు ఫారాన్ని కూడా విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించనున్నారు. మరోవైపు సిద్దిపేట జిల్లాలో సుమారు రూ.544.11 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ పర్యటనతో జిల్లాలో రాజకీయ, అభివృద్ధి కార్యక్రమాలపై ఆసక్తి నెలకొంది.