ఘనంగా వెన్నముద్దల బతుకమ్మ

18-10-2026 | 05:30am
  1. టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో వేడుకలు
  2. భారీ బతుకమ్మలతో ప్రత్యేక ఆకర్షణ

ఖమ్మం, అక్టోబర్ 17(విజయక్రాంతి): ఆడబిడ్డల ఆత్మగౌరవ ప్రతీకగా, తెలంగాణ సంస్కృతి(Culture of Telangana), సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా యూనియన్ కార్యాలయంలో(District Union Office) ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా మహిళా విభాగం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ఈ వేడుకల్లో మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో గౌరీదేవికి పూజలు నిర్వహించారు.

ముందుగా పసుపు, కుంకుమ, వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి, దీపారాధన చేశారు. వెన్న ముద్దల బతుకమ్మ సందర్భంగా ప్రత్యేక నైవేద్యాలు సమర్పించారు. మహిళా ఉద్యోగులు తమ ఇళ్లలో సంప్రదాయబద్ధంగా పేర్చిన బతుకమ్మలను యూనియన్ కార్యాలయానికి తీసుకొచ్చి కొలువుదీర్చారు. పూలతో అందంగా పేర్చిన భారీ బతుకమ్మలు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ, నృత్యాలతో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా సంబురాల్లో పాల్గొన్నారు. వెజిటేబుల్ మార్కెట్ మహిళల కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిసింది. టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు, టీజీఈ జేఏసీ జిల్లా చైర్మన్ గుంటుపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, ప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు.

టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి కొణిదెన శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగ మహిళల ఐక్యతకు, కుటుంబ అనుబంధాలకు, సామాజిక సమైక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. టీఎన్జీవోస్ ఖమ్మం జిల్లా మహిళా విభాగం కన్వీనర్ జి.మృదుల మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను విజయవంతం చేయడం సంతోషంగా ఉందన్నారు. 

కార్యక్రమంలో టీజీవోస్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వరరావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, అసోసియేటెడ్ అధ్యక్షులు మల్లెల రవీంద్ర ప్రసాద్, టీఎన్జీవోస్ సెంట్రల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జెడ్.ఎస్. జైపాల్, జిల్లా కోశాధికారి వల్లపు వెంకన్న, అసోసియేట్ అధ్యక్షుడు కొమరగిరి దుర్గాప్రసాద్, శేషు ప్రసాద్, టీఎన్జీవోస్ ఉపాధ్యక్షులు ఎర్ర రమేష్, శ్రీధర్ సింగ్, అస్లాం ఖాన్, జాయింట్ సెక్రటరీలు తాళ్లూరి శ్రీకాంత్, భూస చంద్రశేఖర్, హరికృష్ణ కోణార్, పెద్దినేని రాధాకృష్ణ, నగర అధ్యక్షులు బెజ్జంకి ప్రభాకరాచారి, డ్రైవర్ సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు,

నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి వెంకటరమణ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఫోరం అధ్యక్షుడు కోటపాటి రుక్మారావు, మహిళా ఉద్యోగ ప్రతినిధులు లలిత కుమారి, రాధికా రెడ్డి, ఎన్. విజయ, కోమలి, సుబ్బమ్మ, టీఎన్జీవోస్ నాయకులు గుర్రం శ్రీనివాసరావు, మెట్టు వీరయ్య, ప్రసాద్, విజయ్, సైదులు,ఏ.సుధాకర్, బుర్రి వెంకటేశ్వర్లు, బుర్రి నాగేశ్వరరావు, రవి, అంజమ్మ, నరేందర్, రమేష్, గఫూర్  పాల్గొన్నారు. 


మరిన్ని వార్తలు