13న ‘టామ్‌కామ్’ విదేశీ ఉద్యోగ అవకాశాల నమోదు
మహబూబాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్మిక(Telangana State Government Labour), ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పరిధిలోని తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్’ (టామ్ కామ్) ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లాలో విదేశీ ఉద్యోగాల కోసం అభ్యర్థుల నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రజిత తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హత, నైపుణ్యం మరియు సెమీ-స్కిల్డ్ కలిగిన కార్మికులకు జర్మనీ, యూకే, ఇజ్రాయెల్, ఆస్ట్రియా, పోలాండ్, సౌదీ అరేబియా, మారిషస్, దుబాయ్ తదితర దేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.ఈ ప్రత్యేక నమోదు కార్యక్రమం నవంబర్ 13, 2026న మహబూబాబాద్‌లోని ఎస్సీ కార్యాలయ ప్రాంగణంలోని ఏటీసీ లో నిర్వహిస్తామని చెప్పారు.
విదేశాల్లో ఉద్యోగం చేయాలనే ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ సదస్సుకు హాజరై అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు సురక్షితమైన, చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా విదేశాలకు వెళ్లేందుకు టామ్‌కామ్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ www.tomcom.telangana.gov.in ను సందర్శించాలని లేదా హెల్ప్‌లైన్ నంబర్ 080 3552 4946 ను సంప్రదించాలని పేర్కొన్నారు.