బాల్య వివాహ రహిత గ్రామంగా రుక్మాపూర్

11-11-2026 | 03:15pm

చేగుంట నవంబర్ 11,విజయక్రాంతి: చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామాన్ని(Rukmapur Village) బాల్య వివాహ రహిత గ్రామంగా జిల్లా మహిళా శిశు సంక్షేమ(Women and Child Welfare) అధికారి  హిమ భార్గవి ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య ప్రాముఖ్యత, బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు. 

18 ఏళ్లు నిండని బాలికలకు, 21 ఏళ్లు నిండని బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. కార్యక్రమంలో  సర్పంచ్ నవీన్, ఉపసర్పంచ్,మండల స్థాయి అధికారులు, వార్డ్ సభ్యులు  గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు