కుల్గామ్‌లో ఉగ్రదాడి.. జవాన్లకు గాయాలు

11-11-2026 | 03:13pm

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల(Terrorist gunfire) ఘటన కలకలం రేపింది. కుల్గామ్ జిల్లా(Kulgam District)లో సీఆర్పీఎఫ్ (CRPF) బలగాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం.

కాల్పుల ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు(Security forces) వెంటనే స్పందించాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు ఘటనాస్థలంలో భద్రతను కట్టుదిట్టం చేశాయి. అదనపు బలగాలను కూడా రంగంలోకి దించినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి బాధితుల ఆరోగ్య పరిస్థితి, కాల్పులకు పాల్పడిన వారి వివరాలు ఇంకా పూర్తిగా వెల్లడికాలేదు. భద్రతా బలగాల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. 

మరిన్ని వార్తలు