దండారీ సంబరాల్లో అరిగెల జోష్.. మూడు గ్రామాలకు బంపర్ గిఫ్ట్!
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): మండలంలోని బలాన్పూర్, మోవాడ, పార్వతి మోవాడ్, కాప్రి గ్రామాల్లో నిర్వహిస్తున్న ఆదివాసీల దండారీ ఉత్సవాల్లో అరిగెల నాగేశ్వరరావు పాల్గొని సందడి చేశారు (Tribal Festival).
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడం అభినందనీయమన్నారు (Tribal Culture). దండారీ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు మూడు గ్రామాల్లో షెడ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు (Infrastructure Development).
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుంకరి పెంటయ్య, టౌన్ అధ్యక్షుడు ఆకుల సంతోష్, మాజీ వార్డు సభ్యుడు చెనవేణి మల్లేష్, గ్రామ పెద్దలు ఆత్రం లింగు మానుకు, జంగు కటూర్, పుర్కా దావవులతరావు, పుర్కా మంగు, ఆత్రం కేశవరావు, కోట్నాక జగ్గు, కోరంగ రాంచందర్, పార్చకి దేవు పటేల్, పుర్కా విశ్వనాథరావు, కోరంగా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు (Village Leaders).