ఓజీకి సీక్వెల్స్.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

12-11-2026 | 11:06am

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), దర్శకుడు సుజీత్ (Director Sujeeth) కాంబినేషన్‌లో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ చిత్రం ఓజీ (They Call Him OG) సీక్వెల్స్‌పై సంగీత దర్శకుడు తమన్ (Music Director Thaman) అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు.

సుజీత్ ఓజీ-2 స్క్రిప్ట్‌ను స్పీకర్లు పగిలిపోయే రేంజ్‌లో సిద్ధం చేశారని, ఓజీ-3 కూడా ఉంటుందని తమన్ వెల్లడించారు. ప్రస్తుతం సుజీత్ తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో సినిమా పూర్తయిన తర్వాత ఓజీ-2 సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? పవన్ కళ్యాణ్ ఎప్పుడు డేట్స్ కేటాయిస్తారు? అనే అంశాలు ఆసక్తికరంగా మారాయి. ఓజీ సీక్వెల్స్‌పై తమన్ చేసిన వ్యాఖ్యలతో అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి

మరిన్ని వార్తలు