నల్లబెల్లి మండలంలో నేడు విద్యుత్ అంతరాయం

10-11-2026 | 06:04pm

నల్లబెల్లి, నవంబర్ 10 ( విజయక్రాంతి ): మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం విద్యుత్ సరఫరా(Electricity supply) నిలిచిపోనున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ కృష్ణకాంత్(Electricity Department AE Krishnakanth) తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతు పనుల దృష్ట్యా బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుందని ఆయన వెల్లడించారు.ప్రభావిత గ్రామాలు ఇవే.నల్లబెల్లి- లెంకాలపల్లి-రుద్రగూడెం- కొండాయలుపల్లె-నాగరాజుపల్లి-మామిండ్ల వీరయ్యపల్లి కాబట్టి పై గ్రామాల ప్రజలు ఈ విషయాన్ని గమనించి, విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ కృష్ణకాంత్ కోరారు.

మరిన్ని వార్తలు