పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

10-11-2026 | 06:06pm

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

బెల్లంపల్లి: ప్రభుత్వం అమలు(Government implementation) చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు(welfare and development schemes) సంబంధించిన పెండింగ్ దరఖాస్తులు, పనులను(Pending applications and works) గుర్తించి, నిర్దేశిత గడువులోగా పరిష్కరించేలా  అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak) అన్నారు. మంగళవారం బెల్లంపల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి అధికారులతో వివిధ ప్రభుత్వ పథకాల అమలు, పెండింగ్ దరఖాస్తులు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జి.ఓ. నంబర్ 76, 58, 59 క్రింద వచ్చిన దరఖాస్తులు, భూ భారతి కార్యక్రమం, భూముల రీ-సర్వే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జి.ఓ. నం. 76, 58, 59 లకు సంబంధించిన దరఖాస్తుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత కలిగిన లబ్ధిదారులకు నిబంధనల ప్రకారం ప్రయోజనాలు అందేలా చూడాలని సూచించారు.

భూ భారతి కార్యక్రమంలో భాగంగా భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి, పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని తెలిపారు. రీ-సర్వేకు సంబంధించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, భూ రికార్డుల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలనిన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల క్రింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులకు పథకం ఫలాలు మంజూరు చేసేందుకు అవసరమైన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలనిన్నారు. నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.  ఆయన వెంట బెల్లంపల్లి తహసిల్దార్ లవుడియా కృష్ణ ఉన్నారు.

మరిన్ని వార్తలు