ఉర్దూ జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాకు చెందిన ఉర్దూ జర్నలిస్టులు మీర్జా సలీం బేగ్, హాఫిజ్ సాజిద్ ఖాన్ రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డులు (State-Level Best Journalist Awards)అందుకున్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీయూడబ్ల్యూజేయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన 10వ వార్షిక సమావేశంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సంబంధాల అధికారి యాట్ల సంపత్ కుమార్ అవార్డు గ్రహీతలను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజేయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మునావరుద్దీన్, ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మునావర్ ఖాన్, సంయుక్త కార్యదర్శి మహమ్మద్ ఫయాజుద్దీన్, సభ్యుడు మోయిన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.