చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ

17-11-2026 | 07:47pm

అశ్వాపురం, నవంబర్ 17 (విజయక్రాంతి): పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ(Congress government) ధ్యేయమని పినపాక ఎమ్మెల్యే, తెలంగాణ శాసనసభ ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం అశ్వాపురం మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని 651 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

చేయూత పింఛన్లు పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తాయని, పినపాక నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, సంబంధిత అధికారులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి రమేష్ బాబు, జిల్లా నాయకులు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ సభ్యులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు