పత్తి రైతులకు మద్దతు ధర కల్పించాలి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): మహారాష్ట్రలో క్వింటాల్ పత్తికి రూ.9 వేలకు పైగా ధర లభిస్తుండగా, తెలంగాణలో రైతులకు గిట్టుబాటు ధర దక్కకపోవడం బాధాకరమని బీజేపీ(BJP Demands) జిల్లా ప్రధాన కార్యదర్శులు అరిగెల మల్లికార్జున్, కోవ విజయ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ జిన్నింగ్ మిల్లులు, ప్రైవేటు వ్యాపారులు(Private traders) సిండికేట్గా మారి తూకాల్లో మోసాలు, తరుగు పేరుతో రైతులను దోచుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పత్తికి మద్దతు ధర కల్పించాలని, అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.